మధుర గీతాలు

Nee edalo naku chotu vaddu

నీ ఎదలో నాకు చోటే వద్దు

నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే..హే

నీ నీడై నడిచే ఆశ లేదే

నీ తోడై వచ్చే ధ్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ

అని అబద్ధాలు చెప్పలేనులే

నీ జతలోన నీ జతలోన

ఈ ఎండాకాలం నాకు వానాకాలం

నీ కలలోన నీ కలలోన

మది అలలాగ చేరు ప్రేమ తీరం

నీ ఎదలో నాకు చోటే వద్దు

నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే..హే

చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువై

చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలి పల్లవై

ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగచూపేదో పురివిప్పెనే

కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది

ఈ సయ్యాట బాగున్నది

నువ్వల వేస్తే నువ్వల వేస్తే

నా ఎద మారె నా కథ మారె

అరె ఇది ఏదో ఒక కొత్త దాహం

అది పెరుగుతుంటే వీచె చెలి స్నేహం

ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే

నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమౌనులే

నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో

పసిపాపై ఇలా నా కనుపాపలే

నీ జాడల్లో దోగాడెనే

తొలి సందెలలో తొలి సందెలలో

ఎరుపే కాదా నీకు సిందూరం

మలి సందెలలో మలి సందెలలో

నీ పాపిటిలో ఎర్రమందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు

నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే..హే

నీ నీడై నడిచే ఆశ లేదే

నీ తోడై వచ్చే ధ్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ

అని అబద్ధాలు చెప్పలేనులే

Arere vana jadivana

అరెరె వాన జడివాన

అందాల నవ్వులే పూల వాన

అరెరె వాన జడివాన

అందాల నవ్వులే పూల వాన

మళ్లీ మళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే

గారం పెరిగింది దూరం తరిగింది

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది

నెమలికన్నులాగ చెలి నాట్యమాడుతుంటే

ఎదే పాలపుంతై నా మనసునాడమంది

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది

అరెరె వాన జడివాన

అందాల నవ్వులే పూల వాన

ఆటా పాటా ఓ పాడని పాట

వానే పాడింది అరుదైన పాట

నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు

నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు

మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది

చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది

దేవత ఏది నా దేవత ఏది

తను సంతోషంగా ఆడుతూ ఉంది

నిన్ను మించి వేరెవరూ లేరే

నన్ను మించి నీకెవరూ లేరే

చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట

కళ్లు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట

మల్లెపూల పొద్దు నాకు ఇచ్చిపోవె ముద్దు

ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు

పులకించింది ఎద పులకించింది

చెలి అందాలనే చిలికించింది

అరెరె వాన జడివాన

అందాల నవ్వులే అగ్గి వాన

అరెరె వాన జడివాన

అందాల నవ్వులే అగ్గి వాన

మళ్లీ మళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే

నింగే వంగింది భూమే పొంగింది

నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది

గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు

అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు

ఆడాలి ఆడాలి వానతో ఆడాలి

Chuttesai chuttesai

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే

పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే

ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం

తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా

రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా

అందం చందం ఉన్న పసిడి మొలకవే

బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే

ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి ప్రేయసి

ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి

ఇది వయసుకి వసంత కాలమా

వలపుల తడి తరిగి పోదామా

ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి

రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే

పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే

నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పాంపు వేసె

నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా

Chiru chiru chiru chinukai

చిరు చిరు చిరు చినుకై కురిశావే

మరుక్షణమున మరుగై పోయావే

నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమకోణం

పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ

హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ

పాదం కదిలినదే

ఎదనే నీతో ఎత్తుకెళ్లావే

చిరు చిరు చిరు చినుకై కురిశావే

మరుక్షణమున మరుగై పోయావే

దేవత.. తనే ఒక దేవత..

ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా

గాలిలో తనే కదా పరిమళం

చెలి సఖి అనుమతే అడగకా పువ్వులే పూయునా

సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ

గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే

చెలి చెక్కిళ్లే ముద్దల్తోనే తడిమెయ్యాల

చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే

ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ

హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ

పాదం కదిలినదే

తోడుగా ప్రతిక్షణం వీడక

అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన

నేలపై పడేయక నీడనే

చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా

దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే

గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే

నాలో నేను మౌనంగానే మాటాడేస్తే

మొత్తం తను వింటూ ఉందే తియ్యగా వేదిస్తుందే

ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ

హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ

పాదం కదిలినదే

చిరు చిరు చిరు చినుకై కురిశావే

మరుక్షణమున మరుగై పోయావే

చిరు చిరు చిరు చినుకై కురిశావే

మరుక్షణమున మరుగై పోయావే

Arya-2

karige loga ee kshanam

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిముషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను

ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను

నిదురను దాటి నడిచిన ఓ కల నేను

ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ..

నా సగమేదో ప్రశ్నగా మారిందా ఓ..

నేడీ బంధానికి పేరుందా ఓ..

ఉంటే విడతీసే వీలుందా ఓ..

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే

మరునిముషంలో అలిగే పసివాడివిలే

నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే

నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటని చూస్తుంటే ఓ..

నా బాధంతటి అందంగా ఉందే ఓ..

ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ..

మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ..

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిముషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ

Ringa ringa ringa ringare

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేశాను

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రోషం ఉన్న కుర్రాళ్ళ కోసం వాషింగ్‌టన్ను వదిలేశాను

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి

ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినఆ – ఎవరి కోసం

బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీసం కుర్రగాళ్ళ ఆరా పట్టి

బెంగుళూరు కెళ్ళినాను మంగళూరు కెళ్ళినాను

బీహారు కెళ్ళినాను జైపూరు కెళ్ళినాను

రాయలోరి సీమకొచ్చి సెట్టయ్యాను

ఓహో మరిక్కడి కుర్రోళ్ళేం చేశారు?

కడపబాంబు కన్నుల్తో ఏసి కన్నెకొంప పేల్చేశారు

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గుగుత్తి తేంచేశారు

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఇదిగో తెల్లపిల్లా అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి?

అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్పార్సోరింగ

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

పలకలేక ఈళ్ళెట్టినారు ముద్దుపేరు రింగ రింగా

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగ

బాబ్డ్ హేరు పెట్టినారు సవరం బాగా

రాయిలాగా ఉన్న నన్ను రంగసాన్ని చేసినారుగా

ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా

ఇంటి యెనకకొచ్చినారు యమకరంగా

ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు

ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు

ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు

అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?

పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్?

పంచకట్టు కుర్రాళ్ళలోని పంచ్ నాకు తెలిసొచ్చింది

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ముంతకల్లు లాగించేటోళ్ళ స్ట్రెంతు నాకు తెగ నచ్చింది

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

నీటి బెడ్డు సరసమంటే డర్రు డర్రు

ములకమంచమంటే ఇంక కిర్రు కిర్రు

సుర్రుమన్న సీనులన్నీ ఫోన్లో ఫ్రెండ్సుతోటి చెప్పినా – చెప్పేశావేంటి?

ఫైవ్ స్టారు హోటలంటే కచ్చ పిచ్చ

పంపు సెట్టు మ్యాటరైతే రచ్చో రచ్చ

అన్నమాట చెప్పగానే ఎయిర్‌ల్యాండు గ్రీన్‌ల్యాండు

న్యూజిల్యాండు నెదర్‌లాండు థాయిలాండు ఫిన్‌లాండు

అన్ని ల్యాండ్ల పాపలీడ ల్యాండయ్యారు..

లాండయ్యారా! మరి మేమేం చెయ్యాలి?

హ్యాండు మీద హ్యాండేసేయండి ల్యాండు కబ్జా చేసేయండి

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

హ్యాండు మీద హ్యాండేసేస్తామే ల్యాండు కబ్జా చేసేస్తామే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

Uppenantha ee premaki

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో

రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో

నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో

రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో

I love you…నా ఊపిరి ఆగిపోయినా

I love you…నా ప్రాణం పోయినా

I love you…నా ఊపిరి ఆగిపోయినా

I love you…నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు

సెకనుకోసారైనా చంపేస్తావు

మంచులా ఉంటావు మంటపెడుతుంటావు

వెంట పడి నా మనసు మసి చేస్తావు

తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటా ఆయువే చెలి

గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరాసరి

I love you…నా ఊపిరి ఆగిపోయినా

I love you…నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే

మబ్బులే పోగేసి కాల్చెయ్యనా

చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే

తొలకరే లేకుండా పాతెయ్యనా

నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే

నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే

I love you…నా ఊపిరి ఆగిపోయినా

I love you…నా ప్రాణం పోయినా

I love you…నా ఊపిరి ఆగిపోయినా

I love you…నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

My love is gone

My love is gone.. My love is gone

My love is gone.. My love is gone

పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే

it’s gone it’s gone it’s gone my love is gone

పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే

it’s gone it’s gone it’s gone my love is gone

వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే

గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే

My love is gone.. My love is gone

My love is gone.. My love is gone

ఏ.. గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే

గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే

సరస్సు నిండిపోతుందే సొగస్సు కరిగిపోతుందే

మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే

తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే

ఇక శూన్యమెంత బాగుందే

మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే

ఇక మౌనమెంత బాగుందే…

My love is gone.. My love is gone

My love is gone.. My love is gone

హానెస్టుగుండే పనిలేదే ద బెస్టుగుండే పనిలేదే

హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే

కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మరిచే పనిలేదే

కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్‌తో పనిలేదే

ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు

ఇళ్ళల్లోనా మిగులుతారే

లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు

హిస్టరీలోన వెలుగుతాడే…

My love is gone.. My love is gone

My love is gone.. My love is gone

Tippu topu dora kadilindo

హే టిప్పుటాపు దొర కదిలిండో

ఎవరికి వీడు దొరకడు లేండో

ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో

ఉప్పుకప్పురంబు నొక్క లుక్కునుండో

వీడి లుక్కు చూసి మోసపోకండో

ఎదవండో బడవండో వలలో పడకండో

Come on.. Come on Most Cunning

Come on.. Come on మస్తు Taiming

Come on.. Come on రైటులొలరంగు ఏ యాయి యయ్యో

Come on.. Come on కోతలల కింగు

Come on.. Come on మార్చె తన రంగు

Come on.. Come on పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో

Mr.perfect.. perfect he’s Mr.perfect

లెన్సేసి వెతుకు దొరకదురా ఏ difect

Mr.perfect.. perfect he’s Mr.perfect

లెన్సేసి వెతుకు దొరకదురా ఏ difect

వీడో పెద్ద వెధవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు

వీడి గురించి చెప్పు చెప్పి నాలికంతా కందిపోయింది

కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో

ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ

అయినా ఇంకోసారి ట్రై చేస్తా

తప్పకుండా వీడి తాటతీస్తా

సారీ నేను గుడ్ బాయ్‌లా ఉండాలనుకొంటున్నాను

అందుకే అందరిముందు కాల్చను

హిప్పులూపుతున్న క్యాటు వాకులండో

క్రొకడైల్ వీడు కాలు జారకండో

బ్రూటండో బ్రైటండో లైవే చూస్తుండో

మేడి పండులాంటి మ్యాన్ వీడండో

మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో

చీటండో చీపండో గజిబిజి పజిలండో

Come on.. Come on he’s got a bag of tricks

Come on.. Come on beware you twenty Chicks

Come on.. Come on హార్టు హైజాకరు నమ్మొద్దే..

Come on.. Come on he’s the జ్యాదూగర్

Come on.. Come on he gives you fiver

Come on.. Come on he’s the cool cracker తాకొద్దే..హే..

Mr.perfect.. perfect he’s Mr.perfect

లెన్సేసి వెతుకు దొరకదురా ఏ difect

Mr.perfect.. perfect he’s Mr.perfect

లెన్సేసి వెతుకు దొరకదురా ఏ difect

Come on.. Come on ఓరి గోవిందో

Come on.. Come on వీడు గురువిందో

Come on.. Come on సందు దొరికిందో దోచేస్తాడయ్యో

Come on.. Come on హరియవో శంభో

Come on.. Come on రేగింది పంబో

Come on.. Come on వీన్ని ఆపాలి మేనకో రంభో

Mr.perfect.. perfect he’s Mr.perfect

లెన్సేసి వెతుకు దొరకదురా ఏ difect

Mr.perfect.. perfect.. Mr.perfect.. perfect

Bybe he loves you

ఛ.. వాడికి నామీద ప్రేమే లేదు

He doesn’t love me you know

No he loves you

He loves you Sooo much

ఔనా ఎంత – ఎంతంటే ఆ..

మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత

మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత

మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత

చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంత – ఓ ఇంకా

హో…తెల్లతెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత

పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత

హో…చల్లబువ్వలోన నంజుకుంటూ తిన్న ఆవకాయ కారమంత

పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby he loves you.. loves you..

he loves you so much

హే..అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత

నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత

చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంత

చుర్రుమన్న నీ చూపులోన యెగసే నిప్పులాంటి నిజమంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby he loves you.. loves you..

he loves you so much

పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత

పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత

కుంబకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత

కృష్ణమూర్తిలో లీలలంత రామలాలి అంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby he loves you.. loves you..

he loves you so much

పచ్చివేపపుల్ల చేదు అంత రచ్చబండపైన వాదనంత

అర్ధమైనా కాకపోయిన భక్తి కదిలిన వేదమంత

యేటి నీటిలోన జాబిలంత యేట యేట వచ్చె జాతరంత

ఏకపాత్రలో నాటకాలలో నాటుగోలలంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby he loves you.. loves you..

he loves you so much

అల్లరెక్కువైతే కన్నతల్లివేసే మొట్టికాయ చనువంత

జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత

హో..బిక్కు బిక్కుమంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత

లక్ష మందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby baby he loves you.. loves you..

he loves you too much

ఎంత దగ్గరైనా నీకు నాకు మద్య ఉన్న అంతులేని దూరమంత

ఎంత చేరువైనా నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత

ఎంత ఓర్చుకున్నా నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత

ఎంత గాయమైనా హాయిగానే మార్చే నా తీపి స్నేహమంత

Baby he loves you.. loves you..

he loves you so much

Baby he loves you.. loves you..

I love you so much

Arya

Edo priya ragam vin’tunnaa

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో

ప్రేమా ఆ సందడి నీదేనా

ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో

ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా

ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా

ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం

నువ్వుంటే ప్రతి మాట సత్యం

నువ్వుంటే మనసంతా ఏదో తియ్యని సంగీతం

నువ్వుంటే ప్రతి అడుగు అందం

నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం

నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

ఓ..పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం

అడవినైనా పూదోట చేయదా ప్రేమబాటలో పయనం

దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం

ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం

ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం

ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం

ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం

నువ్వుంటే చిరుగాలే గంధం

నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం

నువ్వుంటే ప్రతి మాట వేదం

నువ్వుంటే ప్రతి పలుకు రాగం

నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా

చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా

మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన

ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన

హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే

సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే

ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే

నువ్వుంటే వెలుగంటూ పోదే

నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే

నువ్వుంటే ఎదురంటూ లేదే

నువ్వుంటే అలుపంటూ రాదే

నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే

Naa preaanu kopam gano

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో చెలియా feel my love

నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో

నా ప్రేమను నేరంగానో సఖియా feel my love

నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో

నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో

feel my love.. feel my love

feel my love.. feel my love

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో చెలియా feel my love

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ feel my love

నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love

నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ feel my love

నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love

నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదని

నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని

నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే

feel my love.. feel my love

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో చెలియా feel my love

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love

ఏదోటి తిడుతూనే నోరారా feel my love

విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love

వదిలెసి వెళుతూనే అడుగారా feel my love

అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే

కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే

ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే

feel my love.. feel my love

నా ప్రేమను కోపంగానో.. నా ప్రేమను కోపంగానో

నా ప్రేమను ద్వేషంగానో.. నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో

నా ప్రేమను నేరంగానో సఖియా feel my love

Aaru

chudoddhe

చూడొద్దె నను చూడొద్దె చురకత్తిలాగ నను చూడొద్దె

వెల్లొద్దె వదిలెల్లొద్దె మది గూడు దాటి వదిలెల్లొద్దె

అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దె

ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే…

చూడొద్దె నను చూడొద్దె చురకత్తిలాగ నను చూడొద్దె

వెల్లొద్దె వదిలెల్లొద్దె మది గూడు దాటి వదిలెల్లొద్దె…

వద్దూ వద్దంటు నెనున్నా వయసే గిల్లింది నువ్వేగా

పోపో పొమ్మంటు నెనున్నా పొగలా అల్లింది నువ్వేగా

నిదరోతున్న హృదయాన్నీ లాగిందీ నువ్వేగా

నలుపై ఉన్న రాతిరికీ రంగులు నువ్వేగా…

నాతో నడిచే నా నీడా నీతో నడిపావే

నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే…

చూడొద్దె నను చూడొద్దె చురకత్తిలాగ నను చూడొద్దె

వెల్లొద్దె వదిలెల్లొద్దె మది గూడు దాటి వదిలెల్లొద్దె…

వద్దూ వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీపైన

కాదూ కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన

కన్నీల్ల తీరం లో పడవల్లె నిలిచున్నా

సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా…

మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే

ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే…

చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దూ

వెల్లొద్దు వదిలెల్లొద్దు మది గూడు దాటి వదిలెల్లొద్దూ

అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదె

గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే…

Bheemilli

Naalo parugulu teese

నీతో నడిచిన నిమిషం నిమిషం

చూపులు కలిసిన తరుణం తరుణం

ఏదో తెలియని మథనం మథనం

కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం

నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా

నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా

ఎన్నడు కదలని నా మదే నీ వెన్నంటే పదమని తరిమెనే

ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే

ఉరికే అల్లరి హృదయం హృదయం

నిన్నే వలచిన సమయం సమయం

సాగే ఇరువురి పయనం పయనం

ఏ దరి చేర్చునో పరువం పరువం

నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా

నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా

పట్టుకున్న చెయ్యే ప్రాయం అల్లుకుంది

వెల్లువైన హాయే మనసు పడమంది

అతడినే తలపులో నిలబెడుతోంది

అందినట్టే అంది ఆశ పెడుతుంది

కళ్ళతోటి నవ్వి మాయమౌతుంది

ఇటు సగం అటు సగం ఒకటౌతోంది

కోరని ఓ వరమే నువ్వై ఎదురుగా నిలిచినది

తీరని ఏ ఋణమో నీతో ముడిపడమంటోంది

ఉరికే అల్లరి హృదయం హృదయం

నిన్నే వలచిన సమయం సమయం

సాగే ఇరువురి పయనం పయనం

ఏ దరి చేర్చునో పరువం పరువం

నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా

మోడై నిలిచిన నిన్నటి వయసే పూచిన కథలే తెలుపనా

ఊపిరున్న శిలై బతుకుతున్నాలే

ఉన్నపాటుగా నే నిన్ను కలిశాలే

నీ జతే దొరికితే మనిషౌతాలే

తూనీగల్లే రోజు తుళ్ళి తిరిగాలే

నిన్ను చూడగానే ఈడునెరిగాలే

ఆయువే తీరినా నిను వీడనులే

తియ్యని నీ కలలే కంటూ తోడుగా ఉంటాలే

ఒంటరి మనసుకు నీ స్నేహం ఊపిరి పోసెనులే

ఉరికే అల్లరి హృదయం హృదయం

నిన్నే వలచిన సమయం సమయం

సాగే ఇరువురి పయనం పయనం

ఏ దరి చేర్చునో పరువం పరువం

Neeto needalle rana

నీతో నీడల్లే రానా

నాలో నేనంటూ లేనా

నిలవదే నిమిషం అయినా

తలపులై తరిమే తపన

నిలువెల్లా నీ ఆలోచన…

నీతో నీడల్లే రానా

నిన్నటి తియ్యని కలయికనే వరమల్లే అనుకోనా

గుండెల్లోన వెల్లువైన గురుతులనే నెమరేసే అలలైనా

ప్రతి స్వప్నం నాలో నిజాలయ్యేనా

నిలిపేనా కంటి ముందుగా నిన్నీ క్షణాన

మరి నీకోసమే వేచెనా…

నీతో నీడల్లే రానా

చేసిన బాసలు చెరగవులే ఎడబాటే ఎదురైనా

నా కోసం నువ్వొస్తావని తెలిపెనులే ప్రతి ఆశ ఎదలోన

మదేనాడో నీతో ప్రయాణమైనా

ఇలా నీకై ఊపిరొక్కటే నిరీక్షించేనా

నను చేరాలి ఎవరాపినా…

నీతో నీడల్లే రానా

నాలో నేనంటూ లేనా

Munna

Manasa nuvvunde chote

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా

నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా

ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన

నా చిత్రం చిత్రించేయ్‌నా కనుపాపైపోనా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా

నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా

మార్చేశావే నా ఈ వరసా

నువ్వు మార్చేశావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా

చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేయ్‌నా

ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గైరానా

ముద్దుల్తో ముంచేసేయ్‌నా కౌగిళికే రానా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా

నీ ఊసే అది తెలిపె మౌనంగా మది మురిసె

కలిశా కలిశా నీతో కలిశా

నీలో నిండి అన్నీ మరిచా

హో నీలో నిండి అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా నీవైపే వచ్చానమ్మా

నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా

ఓ సోనా వెన్నెల సోనా నీ గుందె చప్పుల్లోన

నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా

ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన

ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా

ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన

Naa Autograph

Gurtukostunnayi

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏ మూలనో

నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఈ గాలిలో ఏ మమతలో

మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినిమా

మొదట మొక్కిన దేవుని ప్రతిమ

రేగు పళ్ళకై పట్టిన కుస్తీ

రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ

కోతి కొమ్మలో బెణికిన కాలు

మేక పొదుగులో తాగిన పాలు

దొంగచాటుగా కాల్చిన బీడి

సుబ్బుగాడిపై చెప్పిన చాడీ

మోట బావిలో మిత్రుని మరణం

ఏకధాటిగా ఏడ్చిన తరుణం

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదటిసారిగా గీసిన మీసం

మెదట వేసిన ద్రౌపది వేషం

నెల పరీక్షలో వచ్చిన సున్నా

గోడ కుర్చి వేయించిన నాన్న

పంచుకున్న ఆ పిప్పరమెంటు

పీరు సాయిబు పూసిన సెంటు

చెడుగుడాటలో గెలిచిన కప్పు

షావుకారుకెగవేసిన అప్పు

మొదటి ముద్దులో తెలియనితనము

మొదటి ప్రేమలో తియ్యందనము

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏ మూలనో

నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

Mounangane edagamani

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా

దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా

భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా

బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా

సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది

విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది

అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది

కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది

తెలుసుకుంటే సత్యమిది

తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో

మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో

పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో

మారిపోని కథలే లేవని గమనించుకో

తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు

నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి

నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా

నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా

నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి

అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

Nuvvante pranamani

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికి చెప్పుకోను నాకు తప్ప

కన్నులకు కలలు లేవు నీరు తప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికి చెప్పుకోను నాకు తప్ప

కన్నులకు కలలు లేవు నీరు తప్ప

మనసూ ఉంది మమతా ఉంది

పంచుకునే నువ్వు తప్ప

ఊపిరి ఉంది ఆయువు ఉంది

ఉండాలనే ఆశ తప్ప

ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా

ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా

ఎవరిని అడగాలి నన్ను తప్ప

చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

వెనకొస్తానన్నావు వెళ్లొస్తానన్నావు

జంటై ఒకరి పంటై వెళ్ళావు

కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు

బరువై మెడకు ఉరివై పోయావు

దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు

దీపం కూడా దహియిస్తుందని తేల్చావు

ఎవరిని నమ్మాలి నన్ను తప్ప

ఎవరిని నిందించాలి నిన్నుతప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికి చెప్పుకోను నాకు తప్ప

కన్నులకు కలలు లేవు నీరు తప్ప

Duvvina talane duvvatam

దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడర్ అద్దడం

దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడర్ అద్దడం

అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం

నడిచి నడిచి ఆగడం ఆగి ఆగి నవ్వడం

ఉండి ఉండి అరవడం తెగ అరచి చుట్టూ చూడడం

ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE….

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE

ముఖమున మొటిమే రావడం మనసుకు చెమటే పట్టడం

మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం

త్వరగా స్నానం చెయ్యడం త్వరత్వరగా భోంచేస్తుండడం

త్వరగా కలలో కెళ్ళడం ఆలస్యంగా నిదరోవడం

ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE….

ఇది కాదా LOVE ఇది కాదా LOVE

ఇది కాదా LOVE

Gama gama hangama

గామా గామ హంగామా

మనమే హయి చిరునామ

పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

గామా గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా

గామా గామ హంగామా

మనమే హయి చిరునామ

పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

గామా గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా

నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది

నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది

చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది

నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది

ఆ కోరికేమిటో చెప్పని

నను వీడి నువ్వు వెళ్ళొద్దని

మళ్ళీ రాయిని చెయ్యెద్దని

గామా గామ హంగామా

మనమే హయి చిరునామ

పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది

నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది

నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది

ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది

ఆ మనసు అలిసి పోరాదని

ఈ చెలిమి నిలిచి పోవాలని

ఇలా బ్రతుకును గెలవాలని

గామా గామ హంగామా

మనమే హయి చిరునామ

పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

గామా గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా

Manmadhude brahmanu puni

మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

యాభై కేజీల మందారాన్ని

అయిదున్నర అడుగుల బంగారాన్ని

పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

యాభై కేజీల మందారాన్ని

అయిదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు

మరి మలయాళంలో – ఇరువు ఒహొ

ఇది తీపి మీ భాషలో – మధురం

మరి చేదు చేదు చేదు చేదు – కైక్కు

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు

ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో

రుజిగల్ ఆరిం నాన్ కండు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్

ఏలాం రుజియు ఉండెన్ తరయు నీ ప్రేమతో

నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో

ఇన్నుమెదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్

ఏ మనసిలాయో

నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని

మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజిల చిలిపితనాన్ని

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పెదాలనేమంటారు – చుండు

నడుముని – ఇడుప్పు

నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు

ఆశ దోశ అమ్ము మిండ మీస

ఏయ్ చెప్పమంటుంటే – చెప్పనా

రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతాద్దాలు

ఉందో లేదో చూడాలంటే నీ నడుముని

వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు

పెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడిని

లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు

మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు

విన్నాను నీ హృదయవాణి

వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజిల దుడుకుతనాన్ని

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

Oragne

Sidney nagaram chese neram
ఓల ఓలాల అలా చూస్తూనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సే లోన సర్ఫింగ్ చేస్తుందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది
This is the time to fall in love
fall in love.. O my love
welcome to my heart. I am in love
I am in love.. you are my love
సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది
This is the time to fall in love
fall in love.. O my love
welcome to my heart. I am in love
I am in love.. you are my love

ఓల ఓలాల అలా చూస్తూనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సే లోన సర్ఫింగ్ చేస్తుందిలా

సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం త్సునామి లా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే ఆ కొంచం లోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగా లోలో పొంగింది
ఇవ్వాఏఏ రాలే పాత బాధే నిన్ను చూడ నిన్ను చూడ…

ఆ లేత అల్లర్లే లాగాయిలా నేల వీడి పాదం అడిందిలా
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా నాలో తాజా ప్రేమే ఆరెంజ్‌లా
అప్పుడే పుట్టిన పాపలా నువు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువు చల్ల గాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త హాయే నిన్ను చూడ

ఓల ఓలాల అలా చూస్తూనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సే లోన సర్ఫింగ్ చేస్తుందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది
This is the time to fall in love
fall in love.. O my love
welcome to my heart. I am in love
I am in love.. you are my love

O range love idi o baby

O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that’s why మేరా దిల్ చహ్తే హై సభీ
మౌంట్ ఎవరెస్టై ఎదిగే లవ్‌ని
చేరాలంటే కావాలిగా daring
macanas gold లా తాగే లవ్‌ని
వుండాలంటే చెయ్యాలిగా కూంబింగ్
కమ్మని కవితల కబురుల్లో కనబడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు..హోయ్
O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that’s why మేరా దిల్ చహ్తే హై సభీ

నే వెయ్యిసార్లు ప్రేమిస్తా నా గుండేలోన ఫీలుంది
నే కొత్త చరితనే రాస్తా నా లవ్‌లో లైఫుంది
నే కన్న కలను సాధిస్తా నా లోన పచ్చి నిజంఉంది
ఎదలోకి తొంగి చూశావా నువ్వొనికే తెగువుంది
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ
నువు దామ దామ దామ దామ దామ దారికే దామ్మా
పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని కోరుకోవమ్మా

O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that’s why మేరా దిల్ చహ్తే హై సభీ

లవ్ మంచు పూలు కురిపిస్తే నువు మంటరేపి చంపొద్దు
లవ్ చెయ్యి కలుపుతానంటే నువు చెలిమిని పెంచొద్దు
లవ్ అమృతాన్ని తాగిస్తే నువు చేదు విషం చిమ్మొద్దు
లవ్ పల్లవించు పాటైతే తన గొంతును కొయ్యొద్దు
హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకే సైరా
నువు వేయ్‌రా వేయ్‌రా వేయ్ వేయ్ వేయ్ వేయ్‌రా పందెమే వేయ్‌రా
ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ
ఒకరికి ఒకరను ప్రేమల్లో ఏముందిలేరా గ్యారంటీ
O range love O range love

O range love ఇది ఓ బేబీ
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై యే కభీ
హే heart జోరుడి అబీబీ ప్రేమను తాగే honey bee
that’s why మేరా దిల్ చహ్తే హై సభీ
మౌంట్ ఎవరెస్టై ఎదిగే లవ్‌ని
చేరాలంటే కావాలిగా daring
macanas gold లా తాగే లవ్‌ని
వుండాలంటే చెయ్యాలిగా కూంబింగ్
కమ్మని కవితల కబురుల్లో కనబడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు

Rooba rooba

బు అ బు అ బు.. అబు అబు బు అ బు అ బు.. అబు అబు
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ
అయ్యయ్యయ్యో ఏ మాయో నా వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే
రూబ రూబ రూ…
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ

ఇంచ్ దూరమే అడ్డున్నా ఎలా ఉండగలువంటుంది
నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేతలే చేస్తున్నా తనేం చేసినా కాదనలే
ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ.. ఈ ఆనందంలో సదా ఉండాలనుందే
ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే
నీతో సాగే ఈ పయణం ఆగేనా ఇక ఏ నిమిషం

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ

రెక్కలొచ్చినట్టుంటుంది మదే తేలిపోతుంటుంది
రేయి పగలు మట్లాడేస్తున్నా చాలిదే
నవ్వు నాకు తెగ నచ్చింది నడుస్తున్న కల నచ్చింది
నిన్ను వీడి ఏ వైపు అడుగు సాగదే
ఓ.. నువ్వేమంటున్నా వినలనిపిస్తూ ఉందే
రోజు నీ ఊసే కలల్నే పంచుతోందే
నీతో ఉంటే సంతోషం కాదా నిత్యం నా సొంతం

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ
అయ్యయ్యయ్యో ఏ మాయో నా వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే
రూబ రూబ రూ…

Helo ramante  vachesinda

హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పోపో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పోపో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే…
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పోపో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా

24 carrot lovely ప్రేమ 24 x7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగా సులువుగా
ఏడు రంగులుగా సులువుగా విడి మరి పోనీ తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది సరేలెమ్మంటే బదులిస్తే తప్పేముంది

ఓ హో హో
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పోపో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా

అందమైన కలను చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా
అంతుపొద్దు లేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది నాదం చేతులారా గుండెలో నింపుకో
చెలి నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన

హలో..హలో…
హెల్లొ రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
హెల్లొ రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
హెల్లొ రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే

హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పోపో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే వచ్చేసిందా పోపో పొమ్మంటూ నువ్వంటే
హలో రమ్మంటే వచ్చేసిందా పోపో పొమ్మంటూ నువ్వంటే

Nenu nuvvantu verai unna

నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా
నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచనా నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా…
నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తానేకంగా ఓ…
నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఓ…

నిజాయితి ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరే నని
ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ..ఓ..ఓ..

నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా

తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోదమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ.. గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూడలేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా నా ముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే..ఓ..ఓ..

నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా
నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచనా నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా…
నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తానేకంగా ఓ…
ఓ…ఓ…ఓ..ఓ..ఓ…

Chilipiga chustavala

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల
కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా

నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చేయాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుందలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీసంకెలా

కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము కొంచం స్వార్ధము గొంతులో చాలు గరళం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం

ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల
కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా

Paravaledu
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ.. నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్థమే లేదు
మంచేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని
అందంగా లేను అని నిన్నెవరు చూడరని
నువ్వెవరికీ నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనుసో నీది దాని కన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని
సరదాగా తరిమింది మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి
చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు
ఎవ్వరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు

Ninnu chudani kannelenduku ani
నిన్ను చూడని నిన్ను చూడని
కన్నులెందుకు అని అని
నిన్ను తాకని నిన్ను తాకని
చేతులెందుకు అని అని
మనస్సు చెప్పుతోంది ఈ మంచిమాటని
వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని
సుదూర తీరమేదో ఏరికోరి మీరి చేరగా చెంతగా
మారగా జంటగా సూటిగా ఘాటుగా
రెప్పవేయకుండా మూయకుండా
నిన్ను చూడని నిన్ను చూడని
కన్నులెందుకు అని అని
నిన్ను తాకని నిన్ను తాకని
చేతులెందుకు అని అని

కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా
నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా
కోటదాటి వచ్చా తోటదాటి వచ్చా
కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా
మేఘమల్లే వచ్చా మెరుపులిచ్చా
కౌగిళల్లె వచ్చా కానుకకిచ్చా
చేరగా చెంతగా మారగా జంటగా
వేడిగా వాడిగా చుట్టు పక్కలేవీ చూడకుండా

నిన్ను చూడని నిన్ను చూడని
కన్నులెందుకు అని అని
నిన్ను తాకని నిన్ను తాకని
చేతులెందుకు అని అని

గీత మారుతున్నా రాత మారుతున్నా
ఊపిరాగుతున్నా ఉండలేక వచ్చా
హాని జరుగుతున్నా అలుపు పెరుగుతున్నా
ప్రాణమాగుతున్నా పరుగులెట్టి వచ్చా
అమృతాన్ని తెచ్చా ఆయువిచ్చా
అద్భుతాన్ని తెచ్చా హాయినిచ్చా
చేరగా చెంతగా మారగా జంటగా
నీడగా తోడుగా ఒక్క నీటి బొట్టు జారకుండా

నిన్ను చూడని నిన్ను చూడని
కన్నులెందుకు అని అని
నిన్ను తాకని నిన్ను తాకని
చేతులెందుకు అని అని

Chirugalai vachedevaro
చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో
కలలాగా వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో
అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో
ఎవరంటే నీ వెంట నేనేలే
నేనంటే నిలువెల్లా నీవేలే
నీవంటే తనువెల్లా ప్రేమేలే
ప్రేమించే వేళయిందో
ప్రేమ లేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమ రేఖ దాటెనే ఇలా పాదాలు
ప్రేమ కేక వేసెనే ఇలా ప్రాయాలు
తన మాయ ఏంచేస్తుందో
ప్రేమ లేఖ రేసెనే ఇలా పెదాలు
ప్రేమ లాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమ లోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో
చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో

నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై నాలో ఏమాయనో
రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గే చెరువై లోలో ఏమాయనో
ముసినవ్వుకు మనస్సే లేక మొగ్గ వేసెనో
కొనచూపుకు వయస్సే రేకు విచ్చునో
పసిరేకుల సొగస్సే నేడు పూతపూసెనో
ఆ పువ్వు ప్రేమైందో ఏమో

ప్రేమ లేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమ రేఖ దాటెనే ఇలా పాదాలు
ప్రేమ కేక వేసెనే ఇలా ప్రాయాలు
తన మాయ ఏంచేస్తుందో
ప్రేమ లేఖ రేసెనే ఇలా పెదాలు
ప్రేమ లాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమ లోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో

Chandamamala andagadini
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టుముట్టినా చెలి కొరకే నా పరుగే
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టుముట్టినా చెలి కొరకే నా పరుగే

పెదవులు పగడ కాంతులు పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు గలగలగలలు
కనులలో కోటి రంగులు నడములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు జలజలజలలు
తన కొరకే కలవరమే తన కొరకే చెలి స్వరమే
తన దరికే నా ప్రాణమే ప్రయాణమై

చందమామలా….
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టుముట్టినా చెలి కొరకే నా పరుగే
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టుముట్టినా చెలి కొరకే నా పరుగే

జిగిబిగి మనసు సంకెలా తెగువగా తెంచా నేనిలా
మగువను మార్చా ప్రేమలా తొలితొలి తొలిగా
పరిచిన పసిడి దారిలా విరిసిన వెలుగు ధారలా
నడిచా ఆమె నీడలా కలకల కలలా
తన వలపే అమృతము తన వరమే జీవితము
తన పరమై తరించనీయి సోయగము

చందమామలా….
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టుముట్టినా చెలి కొరకే నా పరుగే

Atu nuvve itu nuvve
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే

రంగు రూపం అంటూ లేనే లేనిది ఈ ప్రేమ
చుట్టూ శూన్యం ఉన్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ నీడ చూడదీ ప్రేమ
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుంది
కను పాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనె లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేశావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదేలా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే

Madhurame madhurame

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమె
సెలయేటికి అలలూ మధురమె
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నె తడిపేస్తే మధురమే
మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమె
సెలయేటికి అలలూ మధురమె
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నె తడిపేస్తే మధురమే

నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
లిపి లేనీ సడి లేనీ ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్నీ మురిపించే ఆ సాగర ఘోషా మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూర్యం అయినా మధురమే మధురమే

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమె
సెలయేటికి అలలూ మధురమె
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నె తడిపేస్తే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయానా ఉదయించే ఆ సూర్యుడి ఎరుపూ మధురమే
రేయంతా వికసించే ఆ వెన్నెల తెలుపూ మధురమే
చెక్కిలి నెరుపూ మధురమే
చెలి కాటుక నలుపూ మధురమే
రాల్చే కను రాల్చే ఆ కన్నెరైనా మధురమే మధురమే

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమె
సెలయేటికి అలలూ మధురమె
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నె తడిపేస్తే మధురమే

O maguva

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసులాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసులాగ మారి కవితే రాశేసా

త్రిబలక్సూ రమ్ములోనా కిక్కు లేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైటూ వేళ నుంచీ మూన్ లైటు వెళ్ళేదాకా
ఫుల్ టైమూ నా గుండెల్లో హాట్ లైను నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా…నీ వలనా మనసే గాయమా…
కుదురేమో లేదాయే నువు నమ్మవుగానీ కలవరమాయే
మగువా ఓ మగువా ఓ మగువా..

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసులాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

కో అంటే కోటిమంది అందగత్తెలున్నా గానీ
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్నీ
క్రేజీగా ఉంటే చాలూ ప్రేమలోన పడతారనే
ట్రూ లవ్ చూపకుంటే పెంచుతారు దూరాన్నె
ఓ మగువా నీకే న్యాయమా…ఎదలో ప్రేమే శాపమా…
మనసేమో బరువాయే నీ మాటలు లేకా మోదైపోయే
మగువా ఓ మగువా ఓ మగువా..

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసులాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

Na manasuki

నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసుని కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచి ఓ…ఓ…
నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసుని కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచి ఓ…
నా వయసుకి వంతెన వేసీ నా వలపుల వాకిలి తీసీ
మదిగది తెరిచీ పక్కేపరచీ ఉన్నావూ లొకం మరచీ
నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసుని కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచి ఓ…ఓ…

నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకీ నీ చెలిమికీ మొదలాయే మాయే మాయే
నీ అడుగుకి ఆకులు పువ్వులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకీ నీ కధలకీ కధలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడీ అటుపైనా ఏదో అడిగీ
నా మనసనే ఒక సరసులో అలజడులే సృష్టించావే

నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసుని కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచి ఓ…ఓ…

ఒక మాటా ప్రేమగ పలకాలీ
ఒక అడుగూ జతపడి నడవాలీ
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒకసారీ ఒడిలో ఒదగాలె ఎదపైనా నిదరే పోవాలె
తియ్య తియ్యనీ నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించానే నీ ఆతృత గుర్తించాలే
లెక్కతేలకా బదులియ్యకా మౌనంగా చూస్తూన్నాలే
నా..న….

Yemaindhi ee vela

ఏమైందీ ఈవేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వెయ్యనీదు ఆ అందం మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం

చినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెల వెల వెలబోయెనే
తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే

ఏమైందీ ఈవేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింతా
తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా
మొదటిసారీ మెరుపు చూశా కడలిలాగే ఉరకలేసా

Allantha doorala

అల్లంత దూరాల ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏపోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడూ శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది సుందరి నీడా
ఇందరి చేతులు పంచిన మమతా
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవగా
అందానికే అందమనిపించగా
దిగివచ్చెనో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈనది
తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయంఎ సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా…

అల్లంత దూరాల ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

Dhinaku dhin jiya

శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల
ధినక్ ధిన్ జియా దూకుడేందయ్యా
తాకిడేందయ్యా వేగలేనయ్యా
అబ్బో నీ వల్ల నీ వల్ల నీ వల్ల రే..
నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వాద్యాలే మోగించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా
మప మప మప రిమ గరిస
శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా…జియా…జియా..

నవ ఎవరది వదనా మది కదిపిన మదనా
నస పిలుపుల నిపుణా నవ్విస్తే కాదు అనగలనా
లయ తెలిసిన లలనా శృతి కలిపిన సుగుణా
శత మదగజ గమనా కవ్విస్తే కాలు నిలబడునా
మలుపులు తిరిగిన రచనా – మలుపులు తిరిగిన రచనా
వలపులకొక నిర్వచనా – తొలి వలపులకొక నిర్వచనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వేదాలే వల్లించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మేనాతో నీ పని లేదయ్యా
మప మప మప రిమ గరిస
శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

అణువణువున తపనా అలుపెరుగని వెపనా
నిశి కిరికిరి కిరణా నీతోటి నేను పడగలనా
కసి మెరుపుల కరుణా సుఖ విరుపుల సృజనా
జగమెరుగని జగనా నీ పైకి నేను ఎగబడనా
మగసిరి గడసిరి ద్విగునా – సొగసరి గడసరి ద్విగునా
సరసపు సరసలు దిగనా – చెలి సరసపు సరసుల దిగనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వేలాది బంధువులొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దిన చర్య
మప మప మప రిమ గరిస
ధినక్ ధిన్ జియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల

Chirugale vaste vaste

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో ఒక్కో చినుకు ముత్యపు చినుకై పూస్తే పూస్తే
చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో దోస్తీకొచ్చే తోడే ఉంటే మస్తే మస్తే
హే గుంగురో అరె గుంగురో
అరె సూపరో అరె క్రాపురో
అరె అరె అరె గుంగురో అరె గుంగురో

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో
లైఫంటే యెంగలో రంగురో

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
చినుకుల్లో సల్సా జల్సా చిదే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే అరె మస్తే మస్తే
చిందే వేస్తే మస్తే మస్తే..మస్టే మస్తే

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో
లైఫంటే యెంగలో రంగురో

Mirapakay

Gadi Thalupula

గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా
అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో
తలమునకల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా
అరమరికల తెర విడు అలికిడి పోల్చుకో తేల్చుకో
ఉడికే ఈడుతో పడలేకున్నా
దయతో నన్నాదుకో దరికొస్తున్నా
కొరికే ఈ కోరికే వివరిస్తున్నా
నిను తాకే గాలితో వినిపిస్తున్నా
రమణి రహస్య యాతన చూశా
తగు సహాయమై వచ్చేశా
కనుక అదరక బెదరక నా జంటే కోరుకో చేరుకో
ఉడికే ఈడుతో పడలేకున్నా
దయతో నన్నాదుకో దరికొస్తున్నా

నువ్వెంత అవస్థ పడుతున్నా
అదంత సమస్య కాదన్నా
చిలకరో చిటికెలో తపన తగ్గించి పోలేనా

ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని
ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని
వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ
ఓర్చుకోలేని ఆపసోపాలని
ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని
ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని
వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ
ఓర్చుకోలేని ఆపసోపాలని
పడతి ప్రయాస గమనిస్తున్నా
నే తయారుగానే ఉన్నా
సొగసు విరివిగ విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో
ఇదిగో తీసుకో ఎదరే ఉన్నా
నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా

అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని
కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని
చెప్పకుండా విని చెంతకొస్తావని
గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని
అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని
కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని
చెప్పకుండా విని చెంతకొస్తావని
గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని
తెలిసి మరెందుకీ ఆలస్యం
తక్షణం తథాస్తనుకుందాం
నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో
ఉరికే ఊహలో విహరిస్తున్నా
మతిపోయే మాయలో మునకేస్తున్నా

నువ్వెంత అవస్థ పడుతున్నా
అదంత సమస్య కాదన్నా
చిలకరో చిటికెలో తపన తగ్గించి పోలేనా

Dhinaku dhin jiya

శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల
ధినక్ ధిన్ జియా దూకుడేందయ్యా
తాకిడేందయ్యా వేగలేనయ్యా
అబ్బో నీ వల్ల నీ వల్ల నీ వల్ల రే..
నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వాద్యాలే మోగించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా
మప మప మప రిమ గరిస
శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా…జియా…జియా..

నవ ఎవరది వదనా మది కదిపిన మదనా
నస పిలుపుల నిపుణా నవ్విస్తే కాదు అనగలనా
లయ తెలిసిన లలనా శృతి కలిపిన సుగుణా
శత మదగజ గమనా కవ్విస్తే కాలు నిలబడునా
మలుపులు తిరిగిన రచనా – మలుపులు తిరిగిన రచనా
వలపులకొక నిర్వచనా – తొలి వలపులకొక నిర్వచనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వేదాలే వల్లించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మేనాతో నీ పని లేదయ్యా
మప మప మప రిమ గరిస
శుభ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా…

అణువణువున తపనా అలుపెరుగని వెపనా
నిశి కిరికిరి కిరణా నీతోటి నేను పడగలనా
కసి మెరుపుల కరుణా సుఖ విరుపుల సృజనా
జగమెరుగని జగనా నీ పైకి నేను ఎగబడనా
మగసిరి గడసిరి ద్విగునా – సొగసరి గడసరి ద్విగునా
సరసపు సరసలు దిగనా – చెలి సరసపు సరసుల దిగనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వేలాది బంధువులొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దిన చర్య
మప మప మప రిమ గరిస
ధినక్ ధిన్ జియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల

Chirugale vaste vaste

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో ఒక్కో చినుకు ముత్యపు చినుకై పూస్తే పూస్తే
చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో దోస్తీకొచ్చే తోడే ఉంటే మస్తే మస్తే
హే గుంగురో అరె గుంగురో
అరె సూపరో అరె క్రాపురో
అరె అరె అరె గుంగురో అరె గుంగురో

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో
లైఫంటే యెంగలో రంగురో

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
చినుకుల్లో సల్సా జల్సా చిదే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే అరె మస్తే మస్తే
చిందే వేస్తే మస్తే మస్తే..మస్టే మస్తే

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో
లైఫంటే యెంగలో రంగురో

Silaka raye silaka

సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా
గుండెల్లో గోలి సోడ పేలుతున్నదే
ప్రేమ పిచ్చి ఒకటే కనక
కునుకే పడక ఒళ్ళంతే తీనుమారు ఆడుతున్నదే
బోలో హే సలాం బోలో హే సలాం
తన నన్నన నన్నన హే సలం
బోలో హే సలాం బోలో హే సలాం
ఓ మేరీ చెలియా సావరియా
ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా
ఇకపైన ఎకడైనా అరె ధడే ధడే లవ్ పటాసు పేలుద్దామా
హే హే హే చరితలకే దిమ్మ తిరిగెలా తుఫాను రేపాల
సడెనుగా సునామి రావాల
ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి
రచ్చ రచ్చ చెయ్యాలె
బోలో I am in love బోలో I am in love
మన బ్యానర్లు కడదం బస్టాండులో
బోలో I am in love బోలో I am in love
మన జెండాలు కడదం జంక్షన్లలో
బోలో I am in love బోలో I am in love
మరీ మాకెట్టి చెబుదాం మార్కుట్టులో
బోలో I am in love బోలో I am in love
మన హోర్దింగులెడదాం మైన్ రోడ్డులో
సిలకా రాయే సిలకా

నేను I love you నీకు చెప్పాలిలే
నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే
నీ మావయ్య చెవిలో ఊదాలిలే
మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే
ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే
ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే
అరె ఆర్కుట్లు మనమే మింగాలిలే
హే హే హే పైకెనక నా రావసిలక నన్ను వాటేసుకోవాల
చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాల
ఏయ్ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి
పిచ్చెక్కి పోవాలే

బోలో I am in love బోలో I am in love
మన ఫోటోలు వేద్దాం పేపర్లలో
బోలో I am in love బోలో I am in love
చెలి కచేర్లు చేద్దాం కాలేజిల్లో
బోలో I am in love బోలో I am in love
తెగ స్క్రోలింగులిద్దాం ఛానెల్సుల్లో
బోలో I am in love బోలో I am in love
full ఫోకస్సు అవుదాం పబ్లిక్కుల్లో
సిలకా రాయే సిలకా

బనాది తుజ్ కో మేరీ జోడి
అదా పే ఛడ్ జా మేరీ గాడీ
బజావో దిల్ కీ హర్ ఘంటీ
దిఖావో ప్యార్ కీ ఏక్ చిట్టీ

ముద్దు మెసేజిలెన్నో పోవాలిలే
హద్దులే ఉన్నాగానీ దాటాలిలే
అర్ధ రాత్రిల్లు ఫోనే మోగాలిలే
పొద్దు పొద్దున్నే మళ్ళీ చూడాలిలే
డైలి వెయిటింగులెన్నో చెయ్యాలిలే
సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలిలే
లవ్ మీటింగులెన్నో ఇవ్వాలిలే..
హే హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి బండ బూతుల్ని తిట్టాలే
ఊరంతా పంచాయితీ పెట్టాలే
మా ఇంటి ముందు టెంటు వేసి
లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే

బోలో I am in love బోలో I am in love
ఇక గలాట చేద్దాం గల్లీలలో
బోలో I am in love బోలో I am in love
తెగ భజనలు చేద్దాం బజారులో
బోలో I am in love బోలో I am in love
బోలో I am in love బోలో I am in love
ఫుల్లు ఫేమస్సు అవుదాం ఈ దెబ్బతో
సిలకా రాయే సిలకా..సిలకా రాయే సిలకా

Vaishali I am very sorry

హే చూడొద్దే చూడొద్దే చూడొద్దే చూడొద్దే కోపంగా చూడొద్దే
అరె చంపొద్దే చంపొద్దే చంపొద్దే చంపొద్దే నన్నిట్టా చంపొద్దే
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్
వైశాలి I’m ver very sorry అంటున్నా ఇంకోసారి I’m sorry
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా
వైశాలి I’m very sorry మిస్టేకే
జరిగుంటే మళ్ళోసారి I’m very sorry
సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి
నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి
నీ ఫేసుకది సూటవ్వదు
అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో
నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం
బాగా లేదు బాగా లేదు
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి

హే..తగువెపుడూ తెగే దాకా లాగావంటే లాసైపోతావే
అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే
సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే
సుఖపడే యోగం లేనే లేనట్టే
కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే
అని ఎవడో మీ చెవిలో క్యాబేజే పెట్టాడే
ఆ మాట పట్టుక్కూర్చోవద్దు
అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో
ఈ గంతులేసే వయసులోనే పంతమంటే
వద్దే వద్దు రానీవద్దు

హే..యారారె రే..
తిట్టి తిట్టి పెదాలెలా కందాయొ చూడే
విను వినవే సున్నం లాగా మూతే పెట్టి సతాయించొద్దే
ఉన్నదొకటే కదా యెదవ జిందగీ
దాన్ని ఏడిపించకే మాటిమాటికీ
నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా
గిరి గీసి కూర్చొంటే వదిలేయరా జనమంతా
నువ్వు గింజుకున్నా లాభం లేదు
అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో
గంతలేసి లోకమంతా చీకటంటే
ఎలా లేదో ఓసేయ్ మొద్దు

అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా వైశాలి

Adigora Chudu

అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో..
ఐశ్వర్య రాయిని అడిగానా దీపిక పదుకొనె అన్నానా
కత్రినా కైఫే అవసరమా
అరె గిల్లుని జిల్లని గిల్లే పిల్లే నాకే ఇప్పుడు కావాలే
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్లంతా దున్నుకు పోయే కన్నులు ఉన్నది యాడుందో
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో
అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో

కౌన్ రే కౌన్ రే ఎక్కడున్నావ్ ప్రియతమా
ఢూండ్‌నా ఢూండ్‌నా జాడ కాస్త చెప్పుమా
జిందగీ కీ రాహ్ మే జంటకత్తు లాత్తొనే
ప్యార్ తేరా చాహు మే కాస్త నాకు ప్యార్ దే
ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..హేయ్

ఈ ప్రేమనేది పేడ లాంటిది ఉండగా చుడితే గొబ్బెమ్మవుద్ది
నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది
గోడకేసి కొడితే పిడకవుద్ది
అంటే నా ఉద్దేశ్యం ఎలా మొదలౌద్దో ఎప్పుడు ఫినిషౌద్దో తెలీదో..

బైకు బ్యాక్‌కి కళ పెంచేది
ఇంటి ఫ్రంటులో వెలిగించేది
గంట గంటకీ విసిగించేది
ఆ గుంట యాడుందో…
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో

అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో

హే హే హే హే రొంబా రొంబే
Right Now I am Feelin Alone
Girl Are You The One
Coz I Want Sombody Here With Me
Take Me Away
Girl Dont Make Me Wait
Come Away

Come Close To Me, You Are The One For Me

మనసిచ్చిందంటే మబ్బుల్లో స్టెప్పులేస్తా
ముద్దిచ్చిందంటే ముంగిట్లో ముగ్గులేస్తా
వాటేసిందంటే వండేసి వడ్డించేస్తా
దీనబ్బ యాడుందో..
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో

అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో..

Ninnena nenu

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా
కొత్తగా లవ్ లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుందే
ముందుగా మనసుకి తెలిసుందే ముందుకే నెడుతూ ఉంటుందే
తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుందే
నొప్పిలో తీపి కలొస్తుందే రెప్పలో రేపు మురుస్తుందే
నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా

తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా
మగతనిపించే మగతనమున్నా మునివనిపించే బిగువేనా
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా
నాకేమవుతావో చెప్పవా ఇపుడైనా
చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే క్వశ్చన్లే ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరలే
ధరణిలా అంతా నీ వల్లే అంటూ నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగా తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియం తెంచు అత్తరు సుడివై నను ముంచు
చెంప కుట్టే తేనెపట్టై ముద్దులే తరమనీ
చెమటపుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడిగేయ్ లేకున్నా
చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే క్వశ్చన్లే ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరలే
ధరణిలా అంతా నీ వల్లే అంటూ నిలదీసే నిందల్లే

ఓ.. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా
ఇంతకీ నువ్వొకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా

Nammara nestham

నమ్మరా నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే
తొలి వేకువ ఇంకా రాదేమంటూ నడి రాతిరిలో చీకటి చూస్తూ
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా
ఆ దైవం తానే అవతారంగా దిగివచ్చే తగు తరుణం దాకా
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా
పోగాలం రానీరా ఈ లోగా కంగారా
నమ్మరా నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే

నీలో ఉత్సాహం ఎక్కువైతే ఉన్మాదం దూకే ఆవేశం చేరనీదే ఏ గమ్యం
ఆయుధాన్ని దండిస్తే ఆగడాలు ఆగేనా
కాగడాగా వెలిగిస్తే మార్గం చూపించాలంతే
కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చెయ్యంతే
కార్చిచ్చే రగిలిస్తావా చేను మేసే కంచవుతావా
నమ్మరా నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే

బాణం వస్తుంటే దానిపైనా నీ కోపం
దాన్నిటు పంపించే శతృవేగా నీ లక్ష్యం
వీరధర్మం పాటిస్తే పోరు కూడా పూజేగా
కర్తవ్యంగా భావిస్తూ రక్షణ భారం మోస్తావో
కక్ష సాధిస్తానంటూ హత్యానేరం చేస్తావో
గమ్యం మాత్రం ఉంటే చాలదు
తప్పుడు తోవలో వెళ్లకు ఎపుడూ
నమ్మరా నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే

తొలి వేకువ ఇంకా రాదేమంటూ నడి రాతిరిలో చీకటి చూస్తూ
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా
ఆ దైవం తానే అవతారంగా దిగివచ్చే తగు తరుణం దాకా
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా
పోగాలం రానీరా ఈ లోగా కంగారా

Oye!

176 Beach house lo

నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్‌లో ప్రేమ దేవత
ఎల్లో చుడీదారు వైట్ చున్నీతో దోచె నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్‌గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్ empty గుండె నిండా నిలిచెరో
ఓయ్ ఓయ్ …ఓ..ఓ..ఓ..ఓయ్…
love at first sight నాలో కలిగె
love at first sight నన్ను కదిపె
love at first sight నాకే దొరికె
love at first sight నన్ను కొరికె
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్‌లో ప్రేమ దేవత

రూపంలోన బ్యూటిఫుల్ చేతల్లోన డ్యూటీఫుల్ మాటల్లోన ఫండమెంటల్
అన్నిట్లోన క్యాపబుల్ అందర్లోన కేర్‌ఫుల్ అంతేలేని సెంటిమెంటల్
సినిమాలో మెరిసేటి పాత్ర సిటీలోన దొరకదు రా
నిజంగానే తగిలెను తార వైజాగ్ నగరపు చివరన

చల్ చల్ జరిగే
love at first sight చిల్ కలిగె
love at first sight పల్ పల్ పెరిగె
love at first sight పైకెదిగె

డబ్బంటేనే అలర్జీ భక్తంటేనే ఎనర్జీ నమ్ముతుంది న్యుమేరాలజి
ఇంటి ముందు నర్సరీ అంటనీదు అల్లరి ఒప్పుకోదు హ్యూమరాలజి
ఉండాల్సింది తన బోర్డర్‌లో చేరాల్సింది మిలిటరీలో
ఏదో ఉంది సమ్‌థింగ్ తనలో లాగింది మనసుని చిటికెలో

సం సం సంబరమే
love at first sight వా వరమే
love at first sight ఒక్కో క్షణమే
love at first sight ఓ యుగమే

నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్‌లో ప్రేమ దేవత
ఎల్లో చుడీదారు వైట్ చున్నీతో దోచె నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్‌గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్ empty గుండె నిండా నిలిచెరో
ఓయ్ ఓయ్ …ఓ..ఓ..ఓ..ఓయ్…
love at first sight నాలో కలిగె
love at first sight నన్ను కదిపె
love at first sight నాకే దొరికె
love at first sight నన్ను కొరికె
love at first sight నాలో కలిగె
love at first sight నన్ను కదిపె
love at first sight నాకే దొరికె
love at first sight నన్ను కొరికె

Anukoledanadu

అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు
ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా
నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
అందర్లో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా
నడి సంద్రంలో ఈనాడే అలనయ్యానా
ఓ..అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు
ఊరించే ఎన్నెన్నో వర్ణాలని

నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవిల్లే
నా నవ్వులో జారిన రంగులేరుకోదా
నీతి పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే
నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా
రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా
నా సైగకు తల వంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా
ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా
ఇక ఉన్న చోటనే ఉంటుందా

అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు
ఊరించే ఎన్నెన్నో వర్ణాలని

నిన్నలేని ఓ స్నేహమేదో నీడలాగ మారి
నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా
ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి
ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా
ఈ కలలే తీరేలా ఇన్నాళ్ళకి సాయంగా మారిందా ఆ స్నేహమే
గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోనీ తీరాన్ని చేరుకోనీ
నూరేళ్ళ జీవితం నాదవనీ

నానన్నన్ నానానా నానానన్ నానానా
నానానన్ నానానా నానాననా
నానన్నన్ నానానా నానానన్ నానానా
నానా ననానన్నా నానాననా

Chirunavve navvuthu

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ… ఓ..ఓ..ఓ..ఓ…
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని

నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ..ఓ..
పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా
పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ…
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ…
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ… ఓ..ఓ..ఓ..ఓ…

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

Saradaga chandamamane

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కొరితే ఎల్లాగో ఎల్లాగో మరి
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ..
ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా

చిగురులతోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా..ఓ..
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ..
ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువలోన కలలను కన్నా నిజములు చేస్తావని
చిలిపిగా నేనే చినుకౌతున్నా నీ కల పండాలని..ఓ..
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేవా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా ఓ..
ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

Nannodili needa

నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలి పోతోందే
చీకటిలో ఉదయముండిపోయిందే
నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా

ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటోందే..ఓ..ఓ…
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తోందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే
జాలిలేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా

Apudepudo jarigina kathalu

అపుడెపుడో జరిగిన కథలు ఇప్పుడప్పుడే జరగని కలలు
ఎప్పుడైనా ఈ పనిలేని ఆలోచన దండగే కదా
ఉన్నదోకటే నడిచే సమయం దానితోటే నువ్వు చేసేయ్ పయనం
మరునిమిషం లేదంటూ లైఫే గడిపేయ్ మెరుపులా
గలగల పారేటి నది ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టొద్దు గది ఉన్న హద్దులన్నీ దటుకెల్తే పండగే మరి
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ హే
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ

ఎన్నో మలుపులు కలిసిన జీవితమే
చరితయ్యి వేలిగిపోవాలంటే తెలుసుకోవే
వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనతో
గమ్యమేదో తెలిసి సాగిపోవే
రేపటికై కలలు కంటూ కలలన్నీ నిజం చేస్తూ
ఆశీ నీ శ్వాస ఐటే రాతే మారిపోడా

నహీ నహీ నహీ నహీ నహీ నహీ నహీ
నహీ నహీ నహీ నహీ నహీ నహీ నహీ…
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ హే
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ

అంతులేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెబుతున్నా రాజీపడడం మానుకో
కనులకు నచ్చింది చూసేయ్ మనసుకు తోచింది చేసేయ్
అడిగితే ఈ మాట చెప్పేయ్
నవ్వుతుండగానే పైకిపోతే స్వర్గమే అని
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ హే
సెహెరీ…సెహెరీ…సెహెరీ…
అరె చిన్నది జిందగీ

Varudu

Bahusa O chanchala

బహుశా ఓ చంచలా ఎగిరే నా ఎంచలా
తగిలేలె మంచులా…చూపులో చుపుగా
పైనా కావచ్చులే ఒకటై పోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే
ఏ దూరమైనా చేరువై
బహుశా ఓ చంచలా ఎగిరే నా ఎంచలా
తగిలేలె మంచులా…చూపులో చుపుగా

కనుపాపల్లో నిదురించి కల దాటింది తొలి ప్రేమ
తొలి చుపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ
కలగన్నాను కవినైనాను నిను చూసి
నిను చూశాకే నిజమైనాను తెరతీసి
బహుశా ఈ ఆమని పిలిచిందా రమ్మని
ఒకటైతే కమ్మని పల్లవే పాటగా

అలలై రేగె అనురాగం అడిగిందేమో ఒడి చాటు
ఎపుడూ ఏదో అనుబంధం తెలిసిందేమో ఒక మాటు
మధుమాసాలే మనకోసాలై ఇటు రాని
మన ప్రాణాలే శతమానాలై జతకాని
తొలిగా చూశానులే చెలిగా మారానులే
కలలే కన్నానులే కలిసే ఉన్నానులే
నా నీవులోనే నేనుగా

బహుశా ఓ చంచలా ఎగిరే నా ఎంచలా
తగిలేలె మంచులా…చూపులో చుపుగా

Vedam

Egiripothe entha baguntundi

సా నిరి సని దప మగరిస సరోజా…సరోజా…

గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి తోలి తోలి విరహపు చెరలను వదిలి
గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి తోలి తోలి విరహపు చెరలను వదిలి
గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి
హా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

లోకం రంగుల సంత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
ప్రతిదీ ఇక్కడ వింత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత
ప్రాతివత్యం పై పై వేషం ప్రేమ త్యాగం పక్కా మోసం
మానం శీలం వేసే వేలం మన బతుకుంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

నా.. సొగసులకు దాసుడవౌతావా నీతో
నా.. అడుగులకు మడుగులొత్తగలవా నీతో
నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో
నా గుడి కట్టి హారతలిస్తావా నీతో
నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో
నీ..తో.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

Rupai

పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్ విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్ విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
ఇది చేతులు మారే రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయ్ రూ రూపాయ్ ఇది రూపాయ్ హాయ్ రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్
కోటలు మేడలు కట్టాలన్నా కాటికి నలుగురు మోయాలన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా ప్రాణం తియ్యాలన్నా ఒకటే రూపాయ్

ఈ ఊసరవెల్లి రంగులు రెండే black or white రూపాయ్
ఈ కాసుల తల్లిని కొలిచేవాడి wrong is right రూపాయ్
తన హుండీ నిండాలంటే దేవుడికైనా మరి అవసరమేనోయ్
రూపాయ్ రూ రూపాయ్ ఇది రూపాయ్ హాయ్ రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్
పోయే ఊపిరి నిలవాలన్నా పోరాటంలో గెలవాలన్నా
జీవన చక్రం తిరగాలన్నా జననం నుంచి మరణం దాకా రూపాయ్

Prapancham

ప్రపంచం నా వెంటొస్తుంటే అదెదో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే..ఏమో come again
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేశావే
ఎలా నను ముంచేశావే…
O baby fallen fallen
just love is feeling feeling
couldn’t get out of my mind…
O baby fallen fallen
just love is feeling feeling
couldn’t get out of my mind
every chick in the pool here dress to white
go goh dress to white
you look like an angel and I really know why
I know why
నే నిన్నే చూస్తున్నా అన్ని చేస్తున్నా
ఎవరైనా ఎమైనా అనుకోని జానే దో I don’t care
it’s my style…it’s my life
నీ ఆటే కట్టిస్తాను I know everything
తోడా రిస్కే చేసినా నిను దోచేస్తా నిలువునా
నీ సొమ్మే నువ్వలా దోచేస్తావో my సజ్‌నా

ప్రపంచం నా వెంటొస్తుంటే అదెదో నీవెంటే
ఇలా పడి చస్తున్నానే..
క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేశావే
అలై నను ముంచేశావే…
O baby fallen fallen
just love is feeling feeling
couldn’t get out of my mind…
O baby fallen fallen
just love is feeling feeling
couldn’t get out of my mind

Pada pada

పద పద పద పద పద
నిన్ను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద
నిన్ను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాదంటే ఇంకెపుడూ కానట్టే
ఇక్కడనే ఉంటే ఉన్నా లేనట్టే
now or never now or never
now or never now or never…

నిండునూ రేళ్ళపాటు…
నిండు నూరేళ్ళపాటు ప్రతిరోజు ఏదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళపాటు ప్రతిరోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
యాయి యాయియే యాయి యాయియే
ఎరుకలేని మరునాటిని నేడే
కలల కళ్ళతొ చూస్తూ
now or never now or never
now or never…

నీతో నువ్వు ప్రవహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువు ఆగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
యాయి యాయియే యాయి యాయియే
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు
now or never now or never
now or never…

E chikati

ఏ చీకటి చేరని కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావా
గుర్తు పడతావా

కలలా నిజాలా కనులు చెప్పే కథలు
మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలినీ ఊదాలనే ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా
ఏ చీకటి చేరని కొత్త నీ బ్రతుకులో

Uppongina sandramla

ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలని ఆశ…
కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకుమంటోంది
మనిషిగ బ్రతకాలనే ఆశ…
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై
ప్రాణంలో ప్రాణమై…
మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ
మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ

Prathi nimisham

ప్రతి నిమిషం ప్రతి నిమిషం
అడుగేసేముందాలోచిస్తూ
ప్రతి నిమిషం ప్రతి నిమిషం
ఆలోచనలకు కళ్ళెం వేస్తూ
ప్రతి నిమిషం ప్రతి నిమిషం
అడుగేసేముందాలోచిస్తూ
ప్రతి నిమిషం ప్రతి నిమిషం
ఆలోచనలకు కళ్ళెం వేస్తూ

ప్రతి ఉదయం కల కరిగినా
నిజమెదురుగా నిలబడుతున్నా
మనిషి మనిషిగా జీవిస్తే
మనిషిని మనిషిగా జీవించనిస్తే
వేదం వేదం వేదం వేదం
వేదం వేదం…వేదం…

Kothabangarulookam

Nee Prasnalu neeve

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

Nenai Neevani

నేననీ నీవనీ వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా

నేననీ నీవనీ వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..

పదము నాది పరుగు నీది
రథము వెయ్యిరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా

నేననీ నీవనీ వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..

Nijanga Nenena

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చుస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చుస్తున్నా

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చుస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట
పరవశమేదో తోడవుతుంటే
పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చుస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోన ఏమ్మా

Ok anesa

ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస

పరిగెడదాం పదవే చెలీ – ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ – ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి – నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని – ఎవరాపినా
మరోసారి అను ఆ మాట మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం
ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో
జన్మ ముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటీ లీల
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పిలిచినదా చిలిపి కల – వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిదా – పరుగుతీశా
వదిలినదా బిడియమిలా – ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల – ఎటో చూశా
భలేగుందిలే నీ ధీమా భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా
పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Kalasalalo

కళాశాలలో.. కళాశాలలో..
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగ శాల
కాదా మనసొక ప్రయోగ శాల
కళాశాలలో.. కళాశాలలో..
కళాశాలలో.. కళాశాలలో..

sound గురించి చదివాము
heart beat ఎంతో తెలియలేదు
light గురించి చదివాము
నీ కళ్ళ రిజల్టు తెలియలేదు
magnetics చదివాము
ఆకర్షనేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివము
ఆవేశం ఎంటో తెలియలేదు
physics మొత్తం చదివినా అర్థం కాని విషయాలన్నీ
నీ physic చూసిన వెంటనే అర్థం అయిపోయాయే

కళాశాలలో.. కళాశాలలో..
కళాశాలలో.. కళాశాలలో..

డోలకంలాగ ఊగుతూ సాగే మీ నడుములన్నీ
screwguageతోనే కొలిచెయ్యలేమా
గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు
simple balanceతో చెయ్యలేదా
న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజూ మేమేగా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకి వచ్చారే

పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగ శాల
కాదా మనసొక ప్రయోగ శాల
కళాశాలలో.. కళాశాలలో..
కళాశాలలో.. కళాశాలలో..

Confusion teenage confusion

Confusion confusion టీనేజే confusion
మాటల్లో చెతల్లో total confusion
Confusion confusion ఈ లైఫే confusion
ఛాయిసుల్లో feelingsలో total confusion
నిన్నే తెలిసింది మాకు హృదయలున్నాయి
నేడే స్పందిస్తున్నాయి
ఎన్నో వండర్సే మాకే చూపిస్తున్నాయి
ఇంకా ముందుంది ఏవో ఏవో కావాలన్నాయి
Confusion confusion టీనేజే confusion
మాటల్లో చెతల్లో total confusion
Confusion confusion ఈ లైఫే confusion
ఛాయిసుల్లో feelingsలో total confusion

ఒక్కో క్షణం కన్నుల్లలో temptation
ఒక్కో క్షణం గుండెల్లలో sensation

Maggie షూ తొడిగాము poison scent పులిమాము
pepe jeans కొన్నము అవి మా స్కిన్నుకి చర్మాలే
Pocketలోన cell phone బరువై నిలిపింది పరువే
walletలోన fifty బదులే హండ్రెడ్సేలే
సినిమా హాల్లో వేసే విజిలే పెంచింది లెవెలే
fashion channel చూసె కనులే
లెఫ్టో రైటో చూడొద్దన్నాయే..

Confusion confusion టీనేజే confusion
మాటల్లో చెతల్లో total confusion
Confusion confusion ఈ లైఫే confusion
ఛాయిసుల్లో feelingsలో total confusion

అందాలే కలిగారు గాలుల్లో వదిలారు
శ్వాసల్లో కలిపారు మనసున ఊపిరి ఉప్పెనలే
మెరిసే సొగసే మెరిపించేసేయ్ నరముల్లో కుదిపే
నిలువద్దములే magnets లాగ లాగేశాయే
కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే
కలతో నిజమే fighting చేసె
మీతో friendship అయ్యే దాకే..

Confusion confusion టీనేజే confusion
మాటల్లో చెతల్లో total confusion
Confusion confusion ఈ లైఫే confusion
ఛాయిసుల్లో feelingsలో total confusion

Kannula basalu

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇవి అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యథ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకు తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురుగులిక ఒడ్డుకు సొంతమటా

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే
మంచుబిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యథ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

కన్నుల బాసలు
హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే

Kalalu kane kaalaalu

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా…
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకం లో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా
మెలమెల్లగ వినిపించే ఘోషా…
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

తడికాని కాళ్ళతోటీ కడలికేది సంభంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుభంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహం లో అవి ఉండవులే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే

కలలు కనే కాలాలు కరగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండేల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపంఉ రాగా కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగలము మదికంపం అది తట్టుకోలేం

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

Thalachi thalachi

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకొంటినీ
తెరిచి చూసీ చదువువేళా
కాలి పోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకుంటినీ

కొలువు తీరు తరువుల నీడా
నిన్ను అడిగె ఏమని తెలుపా
రాలిపొయినా పూలా మౌనమా
ఆ ..రాక తెలుపు మువ్వల సడినీ
దారులడిగె ఏమని తెలుపా
పగిలిపొయిన గాజులూ పలుకునా
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
వొడిన వాలి కధలను చెప్పా
సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే
తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకొంటినీ

మధురమైన మాటలు ఎన్నో
మారుమ్రోగే చెవిలో నిత్యం
కట్టెకాలు మాటే కాలునా
ఆ .. చెరిగి పోని చూపులు నన్నూ
ప్రశ్నలడిగే రేయి పగలూ
ప్రాణం పోవు రూపం పోవునా
ఆ.. వెంట వచ్చు నీడకూడా
మంట కలిసి పోవూ
కళ్ళ ముందు సాక్షాలున్నా
నమ్మ లేదు నేనూ
ఒక సారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ

Thalachi thalachi

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకొంటినీ
తెరిచి చూసీ చదువువేళా
కాలి పోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకుంటినీ

కొలువు తీరు తరువుల నీడా
నిన్ను అడిగె ఏమని తెలుపా
రాలిపొయినా పూలా మౌనమా
ఆ ..రాక తెలుపు మువ్వల సడినీ
దారులడిగె ఏమని తెలుపా
పగిలిపొయిన గాజులూ పలుకునా
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
వొడిన వాలి కధలను చెప్పా
సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే
తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ…నీలో నన్ను చూసూకొంటినీ

మధురమైన మాటలు ఎన్నో
మారుమ్రోగే చెవిలో నిత్యం
కట్టెకాలు మాటే కాలునా
ఆ .. చెరిగి పోని చూపులు నన్నూ
ప్రశ్నలడిగే రేయి పగలూ
ప్రాణం పోవు రూపం పోవునా
ఆ.. వెంట వచ్చు నీడకూడా
మంట కలిసి పోవూ
కళ్ళ ముందు సాక్షాలున్నా
నమ్మ లేదు నేనూ
ఒక సారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ

Emantave

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే

సంతోషం ఉన్నా సందేహంలోన లోన
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
యవ్వనమా జమున వనమా ఓ జాలే లేదా జంటై రావే ప్రేమ

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే

అందాలనుకున్నా నీకే ప్రతి చోటా చోటా
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా నీకే ప్రతి పూటా పూటా
వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ
అమృతమో అమిత హితమో హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే

 

thankthankthankthankthankthank

yours�yours�yours�

ramram�ram�

Advertisements

One Response to మధుర గీతాలు

  1. Ram says:

    hi buddy………. Nice collections of songs………. Expecting some more from U………….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s