funny

కాలేజ్

వాళ్ళ అబ్బాయిని ఏ కాలేజ్ లో చేర్చాలా అని ఒక తండ్రి ఒక కార్పొరేట్ కాలేజ్ వాచ్ మెన్ ని ఎంక్వైరీ చేస్తున్నాడు.

“బాబూ..!! ఈ కాలేజ్ మంచిదేనా..??”

వాచ్ మెన్ అన్నాడు, “చాలా మంచిదండి. ఇక్కడ చదివిన వెంటనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. నేను ఈ కాలేజ్ లోనే చదివి, వెంటనే ఈ ఉద్యోగం సంపాదించగలిగాను”.

అబద్ధం

నలుగురు పిల్లలు ఒక్క గాలిపటం కోసం కొట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి తమలో తాము ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు పెద్ద అబద్ధం ఆడితే వాళ్ళకి ఆ బొమ్మ ఇవ్వాలని నిర్ణయించారు. వీళ్ళ మాటలు దూరం నుండి వింటున్న ఒక సన్యాసి దగ్గరగా వచ్చి, “చూడండి పిల్లలూ..ఇలా అబద్ధాలు ఆడటం చాలా తప్పు. పాపం తగులుతుంది. నేను మీ అంత ఉన్నప్పుడు అసలు అబద్ధాలే ఆడలేదు తెలుసా..??”, అన్నాడు. వెంటనే పిల్లలందర్లోకీ కొంచెం పెద్దవాడైన బాబి గాడు అరిచాడు, “ఒరేయ్..ఆ బొమ్మ ఈ సన్యాసికి ఇచ్చేద్దాం. ఈయనే పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతున్నాడు”.

నలభై దొంగలు

ముగ్గురు మగవారు ఒక బార్ లో తమ జీవితంలో కాకతాళీయంగా జరిగిన సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు.

మొదటివాడు చెప్పాడు, “నా భార్య రాముడు-భీముడు సినిమా చూసిన తరవాత కవలపిల్లల్ని కన్నది”.

రెండో వాడు చెప్పాడు, “నా భార్య ముగ్గురు మొనగాళ్ళు సినిమా చూసిన తరవాత ముగ్గురు పిల్లల్ని కన్నది”.

మూడో వాడు వెంటనే గాభరాగా లేచి, “అయ్యో..నేను ఇంటి దగ్గర బయల్దేరినప్పుడు నా భార్య ఆలీబాబా-నలభై దొంగలు సినిమా చూస్తుంది”, అంటూ ఇంటికి పరిగెత్తాడు.

పని విభజన

మేనేజ్ మెంట్ సూత్రాలలో పని విభజన అనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. దాని ప్రకారం, ప్రతి పనినీ ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని ఆ సంస్థలో పని చేసే ఒక్కొక్క ఉద్యోగికి ఇచ్చి చెయ్యమంటారు. దీని వల్ల సమయం వృధా కాకుండా పని వేగంగా పూర్తి అవుతుందని మేనేజర్ల వాదన. కానీ దీని వల్ల ఉద్యోగుల ఆలోచనాశక్తికి పని లేకుండా పోతుందని విమర్శ. దాని గురించే ఈ జోకు.

ఒక మునిసిపాలిటీ ఉద్యోగి రోడ్డు పక్కన ఐదు మీటర్లకి ఒక గుంట చొప్పున గుంటలు తవ్వుతూ వెళ్తున్నాడు. ఆ వెనుక ఒక ఉద్యోగి వాటిని పూడ్చేస్తూ వస్తున్నాడు. ఇద్దరూ చెమట్లు కక్కుతున్నారు. వీళ్ళ శ్రమ చూస్తున్న దారిన పోతున్న ఒక పెద్దమనిషి, “ఏమిటయ్యా..ఈ గుంటలు ఎందుకు తీస్తున్నారు..?? మళ్ళీ వెంటనే ఎందుకు పూడ్చేస్తున్నారు..?? ఇంత కష్టపడి పని దండగ చేస్తున్నారేంటయ్యా..??”, అని అడిగాడు. దానికి, “ఏం లేదు బాబుగారూ..వీడి పని గుంటలు తవ్వడం, నా పని గుంటలు పూడ్చడం, ఈ గుంటల్లో మొక్కలు నాటవలసినవాడు ఈ రోజు సెలవు పెట్టాడు” చెప్పాడు గుంటలు పూడుస్తున్నవాడు గుంటలు పూడ్చడం ఆపకుండానే.

పెద్ద మనిషి

ఒక మంగలి కొట్టుకి ఒక పెద్ద మనిషి ఒక పిల్లవాణ్ణి తీసుకుని వచ్చాడు. ముందుగా తన కటింగు, షేవింగు, మసాజ్, షాంపూ మొదలైనవి అన్నీ చేయించుకున్నాడు. తన తరవాత తన వెంట తీసుకు వచ్చిన పిల్లవాణ్ణి ఆ కుర్చీలో కూర్చోబెట్టి, “బాబూ..చేస్తూ ఉండు. ఇప్పుడే ఒక న్యూస్ పేపరు కొనుక్కొస్తాను” అని చెప్పి వెళ్ళాడు. గంటసేపైనా కూడా తిరిగిరాకపోవడం చూసి విసిగిపొయిన మంగలివాడు, “బాబూ, మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు..?? ఇంకా రావట్లేదు..”, అని అడిగాడు. అప్పుడు, “ఆయన మా నాన్న కాదు. దారిలో కనిపించి మనం ఈ రోజు ఫ్రీ గా కటింగ్ చేయించుకుందాం రమ్మని పిలుచుకువచ్చాడు”, అసలు విషయం చెప్పాడు పిల్లవాడు.

ముద్దు :-( |)

సమకాలీన భారత రాజకీయాల ధోరణి మీద ఇది ఒక సరదా విసురు.

ఒకసారి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నేత ప్రకాశ్ కరత్, విశ్వసుందరి ఐశ్వర్యారాయి, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ ఒకే రైల్లో, ఒకే బోగీలో పక్కపక్కన ప్రయాణిస్తున్నారు. ఇంతలో రైలు ఒక సొరంగమార్గంలోకి ప్రవేశించింది. మొత్తం చిమ్మచీకటి అలుముకుంది.

ఇంతలో ఒక ముద్దు శబ్దం, వెనువెంటనే ఒక చెంపదెబ్బ వినిపించాయి. రైలు సొరంగంలో నుండి బయటికి వచ్చింది.

జార్జిబుష్ చెంప ఎర్రగా కందిపోయి ఉంది.

సోనియా గాంధీ మనసులో ఇలా అనుకుంది, “ఈ జార్జిబుష్ గాడు మన ఐశ్వర్యారాయి అంత అందాన్ని ఇంతవరకు చూడలేదేమో..చీకట్లో కక్కుర్తి పడి చెంపదెబ్బ తిన్నాడు. ఐష్ తొందరపడి కొట్టేసింది. ఈ కోపంతో వీడు అణుఒప్పందం రద్దు చేసేస్తాడేమో..”.

జార్జిబుష్ అనుకుంటున్నాడు, “ఈ కమ్యూనిస్టు కరత్ ఐశ్వర్యారాయిని ముద్దు పెట్టుకోబోయి ఉంటాడు. అది అతననుకొని చీకట్లో పొరపాటున నన్ను కొట్టేసింది. అసలు నేనే ముద్దు పెట్టుకుని ఉంటే పోయేది. దెబ్బకు తగిలినా ఫలితం దక్కేది”.

ఐశ్వర్యారాయి అనుకుంది, “ఈ జార్జిబుష్ గాడు చీకట్లో నేననుకుని సోనియా గాంధీ ని ముద్దు పెట్టుకుని ఉంటాడు. ఆమె గాంధేయవాదం గాలికి వదిలేసి, తెగించి కొట్టేసి ఉంటుంది”.

కమ్యూనిస్టు కరత్ మాత్రం, “అబ్బ..ఇంకొక సొరంగం వస్తే ఎంత బాగుండు..మళ్ళీ ఒక ముద్దు శబ్దం చేసి, జార్జిబుష్ గాడి చెంప కసిదీరా మళ్ళీ పగలగొడతా..!! లేకపోతే భారతదేశాన్ని వాడి తొత్తుని చేసుకుందామనుకుంటాడా..”, అనుకున్నాడు.

చచ్చాడా?

హైవే మీద ఈల వేసుకుంటూ వేగంగా బైక్ నడుపుతున్నాడు రవి. హఠాత్తుగా చెట్లమాటు నుండి ఎగిరొచ్చిన ఒక రామచిలుక రవి ముఖానికి ఫెడీమని తగిలి కింద పడి వెంటనే మూర్ఛపోయింది. రవి ముచ్చటపడి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక పంజరంలో వేశాడు. చిలుకకి మెలకువ వచ్చి చూసేసరికి అది పంజరంలో ఉంది. చుట్టూ ఒకసారి పరిశీలనగా చూసి అది, “నేను గుద్దినోడు సచ్చాడా? నన్ను జైల్లో పెట్టారెందుకు?”, అని కేకలేసింది.

డోంట్ వర్రీ

“విధి వంచించింది” సినిమా షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు పిచ్చేశ్వర్రావు హీరో అమాయక్ కి సూచనలిస్తూ, “మీరిప్పుడు వంద అడుగుల లోతున్న ఈ బావిలోకి దూకాలి. డూపుకి ఈరోజు సెలవు”, అన్నాడు.

“సార్! నాకు ఈత రాదండి!”, కంగారు పడ్డాడు అమాయక్.

“నీకంత కంగారు అక్కర్లేదయ్యా!. ఈ బావిలో నీళ్ళు లేవులే” నవ్వుతూ చెప్పి “షాట్ రెడీ, యాక్షన్” అంటూ అరిచాడు పిచ్చేశ్వర్రావు.

తారక్క

సినీనటి ‘తార’ అవుట్‌డోర్ షూటింగ్‌లో ఒక దగ్గర కూర్చుని ఉంది. కెమరామాన్, డైరెక్టరు కలిసి తర్వాత సీన్ రెడీ చేసుకుంటున్నారు. ఇంతలో “అక్కా … ఒక రూపాయి ధర్మం చేయవా?” చిల్లర డబ్బా ముందుకు చాస్తూ అన్నాడు ముష్టివాడు.

తార వెంటనే వెయ్యిరూపాయల నోటు తీసి ఆ డబ్బాలో వేసింది. ఆశ్చర్యపోయిన ముష్టివాడితో “తొలిసారిగా జీవితంలో అక్కా అని పిలిపించుకున్నాను” ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది ఆ తారామణి.

చేతులు కాలాక…

వందో అంతస్తులో ఉన్న ఒకాయనకు”‘బోలారావుగారూ! మీ డాటర్ సుకన్య చనిపోయింది” అంటూ ఫోన్ రావడంతో కెవ్వున కేకేసి అమాంతం కిందకి దూకేశాడు. 50వ అంతస్తుకు రాగానే తనకు కూతురు లేదని గుర్తొచ్చింది. 25వ అంతస్తుకి రాగానే తనకసలు పెళ్లే కాలేదని గుర్తొచ్చింది.

నిజానికి తన పేరు బోలారావు కాదని, గున్నారావని గుర్తొచ్చేసరికి నేలకు అతి సమీపంలో ఉన్నాడాయన.

ఆమెవరో గుర్తించాలి

“ఈ దేశంలో ప్రతి పది సెకన్లకు ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తోంది. ఈ జనాభాను ఆపు చేయడం ఎలా?”‘ క్లాసులో పాఠం చెబుతోంది టీచర్ రాజకుమారి.

“ఆ స్త్రీని గాలించి వెతికి పిల్లలు కనకుండా ఆపే ప్రయత్నం చేయాలి టీచర్”‘ వెంటనే లేచి నిలబడి వెనక బెంచీలోంచి రాజగోపాల్ గట్టిగా అన్నాడు.

సన్నాస-సన్యాసి

టీచర్‌: సన్యాసికీ, సన్నాసికీ తేడా ఏమిటి?

రాము: “సన్యాసి” అంటే, అందర్నీ వదిలేసిన వాడు సార్‌. ఇక “సన్నాసి” అంటే, వాణ్ణి అందరూ వదిలేసినవాడు సార్‌!

నమ్మకం పోయింది

అనిరుధ్, నవీన్, అనురాగ్‌లు దగ్గర్లోని ఒక అడవికి పిక్‌నిక్ వెళ్ళారు. దుప్పటి పరిచి చికెన్, మటన్, బిర్యాని… రకరకాల ఐటమ్స్‌ని బయటికి తీశారు. కాని తమకు కావలసిన మద్యం సీసా కన్పించకపోయేసరికి కంగారు పడిపోయారు. ఇంటి దగ్గర మర్చిపోయినట్లు రూఢి చేసుకున్నాక నవీన్‌ను వెళ్లి తెమ్మని మిగతా ఇద్దరూ బతిమాలారు.

“నేను తిరిగి వచ్చేదాకా ఏవీ తినకూడదు మరి” కండీషన్ పెట్టాడు నవీన్.

సరే నన్నారు ఇద్దరూ.

అరగంటలో రావలసిన నవీన్ వెళ్లి రెండు గంటలైనా రాలేదు. సాయంత్రం కావస్తుంది. ఇక లాభంలేదని ఇద్దరూ కూడబలుక్కుని చెరొక చికెన్ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోబోయారు. అంతలో చెట్టుచాటునుండి వచ్చిన నవీన్ “చూశారా… మీమీద నమ్మకం లేకే … నేను వెళ్లకుండా చెట్టు చాటునుండి చూస్తున్నాను” అన్నాడు.

ఘన దర్పణం

“దీని ప్రత్యేకత ఏంటి?” పల్లెటూరినుండి వచ్చిన గోవిందు అద్దాలషాపు వాడ్ని అడిగాడు. “ఇది చాలా గట్టి అద్దం సార్ … వంద అంతస్తుల భవనం పైనుండి కిందకి విసిరేశామనుకోండి … గాలిలో ఎన్ని పల్టీలు కొట్టినా … ఒకటో అంతస్తు చేరేదాకా కూడా పగలదంటే నమ్మండి …”

“అబ్బా అంత గట్టిదా … అయితే దీన్ని ప్యాక్ చేయించండి” ఉత్సాహంగా ఆర్డరిచ్చాడు గోవిందు.

వెంగళప్ప జోకులు

  1. ఒక రోజు ఒక అందమైన అమ్మాయి, వెంగళప్పని, “ఐ లవ్ యూ..మనం పెళ్ళి చేసుకుందామా..??”, అని అడిగింది. దానికి వెంగళప్ప, “అయ్యో..మనకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే మా కుటుంబంలో అందరూ బంధువులనే పెళ్ళి చేసుకుంటారు. ఉదాహరణకి, మా అమ్మ మా నాన్నని, మా అన్నయ్య మా వదినని, మా బాబాయి మా పిన్నిని పెళ్ళి చేసుకున్నారు..!!”, అని సమాధానమిచ్చాడు.
  2. వెంగళప్పకి డిటెక్టివ్ నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ, ఆ నవలలని మొదటి పేజీ నుండి కాకుండా మధ్యలో నుండి మొదలు పెట్టి చదివేవాడు. ఒకసారి వెంగళప్ప స్నేహితుడు, “ఏరా..ఎందుకని అట్లా చదువుతున్నావు..??” అని అడిగాడు. అప్పుడు, “మొదటి పేజీ నుండి చదివితే క్లైమాక్స్ ఒక్కటే సస్పెన్స్. కానీ మధ్యలో నుండి చదివితే క్లైమాక్స్ తో పాటు స్టార్టింగ్ కూడా సస్పెన్సే”, అని చెప్పాడు వెంగళప్ప.
  3. “కంగ్రాట్స్ వెంగళప్ప గారూ..మీరు ఒక మగబిడ్డకి తండ్రి అయ్యారు..”, చెప్పింది నర్సు. “ఐతే..ఈ విషయం నా భార్యకి చెప్పి ఆమెని సర్ ప్రైస్ చేస్తాను”, అన్నాడు వెంగళప్ప.
  4. Psychotherapist మానస్ తన నేమ్ ప్లేట్ రాయమని వెంగళప్పకి చెప్పాడు. వెంగళప్ప ఇట్లా రాశాడు–డా. మానస్, psycho-the-rapist.
  5. “భార్యకి, గడియారానికి తేడా ఏంటి..??”, అడిగాడు వెంగళప్ప స్నేహితుడు. “గడియారం విప్పిన తరవాత పని చెయ్యడం ఆగిపోతుంది. కానీ, భార్య విప్పిన తరవాతే అసలు పని మొదలవుతుంది”, చెప్పాడు వెంగళప్ప.
  6. డాక్టర్ వెంగళప్పని అడిగాడు, మీదీ, మీ భార్యదీ బ్లడ్ గ్రూపు ఒకటేనా..??” “ఒకటే అయ్యి ఉంటుంది లెండి. పాతికేళ్ళ నుండి నా రక్తం తాగుతోంది”, చెప్పాడు వెంగళప్ప.
  7. “మీ కొట్లో కలర్ టీవీలు ఉన్నాయా?” అడిగాడు వెంగళప్ప. “ఉన్నాయి”, సమాధానమిచ్చాడు కొట్టు యజమాని. “ఒక పసుపుపచ్చది ఇవ్వండి” అడిగాడు వెంగళప్ప

వంశ పారంపర్యం
“వెంకయ్యగారూ… ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్.
“అమ్మయ్య… బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు వెంకయ్య.

ఏ పక్క
“మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?” సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.

“గోడపక్క” చెప్పాడు సుధాకర్

భయం
“నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను”

“ఏం…. మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?”

“కాదు….. నన్ను తోసేస్తుందని.”

కోరిక
“నాన్నా… నాన్నా… నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?” ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

“వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది” అన్నాడు తండ్రి.

“ఫర్లేదు నాన్నా… మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను” చెప్పాడు కొడుకు అమాయకంగా.

పట్టుదల
“పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్” అన్నాడు నరసింహం

“అలాగా…. అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం” ఎదురన్నాడు కుర్రాడు.

 

thankthankthankthankthankthank

yours�yours�yours�

ramram�ram�

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s